ఖిలావరంగల్, మార్చి 12: గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue)ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వచ్చారు. అంబేద్కర్ భవనం ముందు విగ్రహం ఏర్పాటు చేసేందుకు బుధవారం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, కాంగ్రెస్ నాయకుడు కొత్తపెల్లి శ్రీనివాస్, విగ్రహ దాత రేణుకుంట్ల రవీందర్, ఫౌండేషన్ దాత మెరుగు అశోక్, సంఘం అధ్యక్షుడు పోలెపాక నరేందర్, సంగి ఎలేందర్, సింగిరెడ్డి ఉపేందర్, చింతల నవీన్, కొత్తూరు రాజు, బాల్య కుమార్, జన్ను గోవర్ధన్, విగ్రహ కమిటీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Son Objects To Second Marriage | రెండో పెళ్లికి కుమారుడు అభ్యంతరం.. కాల్చి చంపిన తండ్రి
Raw Coconut | రోజూ ఉదయం పచ్చికొబ్బరిని కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?