అహ్మదాబాద్: రెండో పెళ్లి చేసుకోవాలని ఒక వృద్ధుడు నిర్ణయించాడు. అతడి కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. (Son Objects To Second Marriage) ఆగ్రహించిన ఆ తండ్రి గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో కొడుకు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ సంఘటన జరిగింది. 76 ఏళ్ల రాంభాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. 52 ఏళ్ల కుమారుడు ప్రతాప్ దీనికి అభ్యంతరం తెలిపాడు.
కాగా, మార్చి 9న ఈ విషయంపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో రెండో పెళ్లికి అభ్యంతరం తెలిపిన కొడుకు ప్రతాప్‌పై తండ్రి రాంభాయ్ ఆగ్రహించాడు. గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో కుమారుడు ప్రతాప్ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం కుమారుడి మృతదేహం దగ్గర కుర్చీ వేసుకుని అతడు కూర్చొన్నాడు.
మరోవైపు ప్రతాప్ భార్య జయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొడుకును చంపిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కుమారుడ్ని చంపిన తండ్రిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు.