చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 26 : చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త, బీఆర్ఎస్ నాయకుడు నాయిని సతీశ్ గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగిన ఘటనలో మాజీ విప్ బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు బెయిల్ రాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారని, బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని సతీశ్ డిమాండ్ చేశారు.
చెన్నూర్ ఎస్ఐలు సుబ్బారావు, శ్యాంపటే అక్కడికి చేరుకొని సతీశ్‌కు నచ్చజెప్పినా వినలేదు. మాజీ జెడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్ కౌన్సిలర్ ఇమ్రాన్, బీఆర్ఎస్ నాయకులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి కిందికి దిగాడు. సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.