ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కళావైభవం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సంప్రదాయ కళలు, హస్తకళలను ప్రపంచానికి చాటిచెప్పేలా ‘జీఐ ఆన్ వీల్స్’ రూపొందించినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరు జిల్లాల్లోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) పొందిన 6 కళారూపాలను తొలి విడతగా ఎక్స్‌ప్రెస్ బస్సులపై ప్రదర్శించనున్నట్టు వివరించారు.
ప్రయాణికులు, ప్రజల్లో తెలంగాణ ప్రాచీన కళలు, చేతి వృత్తులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బస్సులపై ఉండే ఈ కళాకృతులు రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు, స్థానిక కళాకారులకు మంచి గుర్తింపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఎంజీబీఎస్‌లో ప్రారంభిస్తారని నాగిరెడ్డి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

