వరంగల్ : రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మంగళవారం ఐనవోలు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ మర్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీపీ తంపుల మోహన్, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ మజ్జిగ జైపాల్, ఐనవోలు దేవస్థాన కమిటీ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్, మండల కో ఆప్షన్ మెంబర్ గుంశావాలి, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, మిద్దెపాక రవీందర్, తదితరులు పాల్గొన్నారు.