కన్నాయిగూడెం, ఏప్రిల్ 3 : ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం బరాజ్ వద్ద నీటిమట్టం 75.6 మీటర్లకు చేరుకుంది. బరాజ్ వద్ద కనీసం 77 మీటర్లు ఉండాలి. కానీ ఎగువ నుంచి 4000 క్యూసెక్కుల వరదనీరు మాత్రమే వస్తున్నది.
దీంతో ఒక గేటు ద్వారా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఆరు మోటర్ల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఫేస్-2లో ఒకటి, ఫేస్-3లోని ఐదు మోటర్లతో రోజుకు 1706 క్యూసెక్కుల నీటిని భీంఘనపురం రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తున్నారు.