హనుమకొండ, సెప్టెంబర్ 28 : ఎస్ఎంఏ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ ఎల్లావుల గౌతమ్ యాదవ్ న్యూడిల్లీలోని కొరియన్ కల్చరల్ సెంటర్లో కుక్కీవాన్ ఇండియా నార్త్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగిన కుక్కీవాన్ హై డాన్ ట్రైనింగ్ సెమినార్ అండ్ పరీక్షను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా గౌతమ్ యాదవ్‌కి 4వ డాన్ బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్‌ను ప్రముఖ గ్రాండ్‌మాస్టర్లు సియోంగ్ రాన్ సోయెల్, డాక్టర్ జోసెఫ్లీ(చైర్మన్, కుక్కీవాన్ ఇండియా), గ్రాండ్‌మాస్టర్ జిమ్మీలచే ప్రదానం చేశారు.
ఇది ఆయన తైక్వాండో పట్ల చూపిన నిబద్ధత, కృషికి నిదర్శనమని గౌతమ్యాదవ్ అన్నారు. ఈ గుర్తింపుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తైక్వాండోని అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయిలో ప్రచారం చేయాలనే దృష్టితో గౌతమ్ యాదవ్ ముందుకు సాగుతున్నట్లు, ఎస్ఎంఏ తైక్వాండో అకాడమీ ద్వారా ఆయన దేశీయ, అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ శిక్షణను అందిస్తూ, యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా దేశవ్యాప్తంగా తైక్వాండో అభిమానం ఉన్నవారికి ప్రేరణగా నిలుస్తుందని గౌతమ్ యాదవ్ అన్నారు.