మొగుళ్లపల్లి, డిసెంబర్ 07 : సర్పంచ్ కంటే ఉన్నతమైన పదవి ఇస్తా అంటే కూడా నాకు ఏ పదవి వద్దు నాకు నా గ్రామ అభివృద్దే కావాలి అంటూ మీకోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి కొడారి రమేష్ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్సిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొడారి రమేష్ ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇస్సిపేట గ్రామ ప్రజలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు వలె అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల బ్రహ్మానందం పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమములో వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పిన్నింటి వెంకటరావు,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.