గణపసముద్రాన్ని గోదావరి జలాలతో నింపాలి
గణపసముద్రం కేవలం ఒక చెరువు కాదని, ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువని, వేలాది ఎకరాల పంటలకు జీవనాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా రామప్ప చెరువుకు చేరుతున్న నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా గణపురం చెరువుకు తరలించి పూర్తిస్థాయి నీటిమట్టాన్ని కొనసాగించాలన్నారు.
- తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి
- ఆగిన కాలువ పనులు పునఃప్రారంభించాలి
- రైతులకు రెండు పంటలకు భరోసా కల్పించాలి
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- గణప సముద్రం, రామప్ప చెరువు పరిశీలన
గణపురం, జూలై 16 : గణపసముద్రం కేవలం ఒక చెరువు కాదని, ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువని, వేలాది ఎకరాల పంటలకు జీవనాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా రామప్ప చెరువుకు చేరుతున్న నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా గణపురం చెరువుకు తరలించి పూర్తిస్థాయి నీటిమట్టాన్ని కొనసాగించాలన్నారు. గురువారం మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపు రం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప సరస్సును ఆయన సందర్శించారు.
రామప్పగణపు రం గ్రావిటీ కాల్వ, రామప్పపాకాల పంప్ హౌస్‌ను పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి నిల్వ లు, భవిష్యత్ అవసరాలపై స్థానిక రైతులు, నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గణపసముద్రం చెరువు పూర్తిస్థాయిలో నిండితే గణపురం మండలంతో పాటు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల తదితర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు మోరంచ వాగు ద్వారా సాగునీరందుతుందన్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు 15 అడుగుల నీరు మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ పరిస్థితుల ను ముందుగానే అంచనా వేసిన బీఆర్ఎస్ ప్రభు త్వం దేవాదుల పథకం కింద రామప్ప నుంచి గణపసముద్రం చెరువుకు గ్రావిటీ కాల్వ నిర్మాణానికి ని ధులు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేసిందన్నారు. అయితే ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. గణపురం చెరువు ద్వారా గణపురం, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, గోరికొత్తపల్లి మండలాల ప్రజలకు తాగు నీరందుతుందన్నారు. ప్రస్తుతం దేవాదుల నుంచి రామప్ప చెరువుకు నీరు చేరుతున్నందున అకడి నుంచి గ్రా విటీ కాల్వ ద్వారా గణపురం చెరువుకు నీటిని విడుదల చేయాలన్నారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని గ్రావిటీ కాలువ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వాన్ని గండ్ర కోరారు. ఆయన వెంట మారెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనర్సింహారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతీ ధనుంజయ్, మాజీ సర్పంచులు నడిపల్లి మధుసూదన్‌రావు, ఐలేని రా మచంద్రారెడ్డి, దాసరి రవి, మోకిరాల తిరుపతిరా వు, మంద అశోక్ రెడ్డి, పిన్నింటి శ్రీనివాసరావు, పి న్నింటి మణిదీప్రావు, వీసం భరత్‌రెడ్డి, బొట్ల స్వా మి, గాజర్ల చింటూ, సాంబశివరావు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

