కృష్ణ కాలనీ, ఏప్రిల్ 10 : రజతోత్సవ సభకు పండుగలా తరలిరావాలని, ఆ ప్రభంజనాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి లాగు తడిసిపోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి మండల రూరల్ అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన గురువారం కమలాపూర్, నాగారం, ఆజంనగర్, నందిగామ, దీక్షకుంట, పంబాపూర్, దూదేకులపల్లి, గొల్లబుద్ధారం, రాంపూ ర్ గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష ని ర్వహించారు.
ఈ సందర్భంగా కమలాపురం గ్రామం లో భారీ బైక్ ర్యాలీలో పాల్గొని, చలో వరంగల్ పోస్టర్‌ను ఆవిషరించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పిట్టలదొర రేవంత్ రెడ్డి మాటలు విని కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మో సం చేశాడన్నారు. కేసీఆర్ తనదైన శైలిలో పదేళ్లలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించి బంగారు తెలంగాణగా తయారు చేశారన్నారు. ప్రలోభాలకు లొంగిన ప్రజలు కాంగ్రెస్ దొంగలకు పట్టం కట్టి అధికారం ఇస్తే పాలన మరిచి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై తిట్ల దండకం సాగిస్తూ, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని, కేసీఆర్‌ను వదులుకొని, కమిషన్లతో, కలెక్షన్ల తో పరిపాలించే వారికి అధికారాన్ని ఇచ్చామని బాధపడుతున్నారన్నారు. రజతోత్సవ సభలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని, ఒక్కో గ్రామం నుంచి 250 నుంచి 300 మందిని తరలించాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, మం డల రూరల్ యూత్ అధ్యక్షుడు పాలకుర్తి రఘుపతి గౌడ్, అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ నాంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ మారెట్ కమిటీ వైస్ చైర్మన్ కాసర్ల దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్, నాయకులు మందల రవీందర్ రెడ్డి, సెగ్గం సిద్ధూ, పాషా, సమ్మ య్య, శ్రీకాంత్ పటేల్, భాసర్ పాల్గొన్నారు.