టేకుమట్ల/రేగొండ, డిసెంబర్ 1 : ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే అధినేత కేసీఆర్ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. సోమవారం టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ), రేగొండ మండలం దమ్మన్నపేట నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరకాలలో ని గండ్ర నివాసంలో బీఆర్ఎస్లో చేరగా వా రికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు చేయదన్నా రు.
పార్టీలో చేరిన వారిలో రామకృష్ణాపూర్ (టీ)కి చెందిన మాజీ సర్పంచ్ కట్ల సదయ్య, మండల యువజన నాయకుడు బోండ్ల మహేశ్‌తో పాటు గ్రామ ప్రధాన కార్యదర్శి అటుకా ల సురేశ్, ఉపాధ్యక్షులు బోలెడ్ల రాజేందర్‌రె డ్డి, అచ్చె రవి, ప్రచార కార్యదర్శి కనుమల్ల క రుణాకర్, కోశాధికారి మడిపోజు సదానందం, సలుపాల కుమార్, పొలాల రాజిరెడ్డి, కొట్టె సురేందర్, అచ్చె రమేశ్, సాద నరేశ్, నరెడ్ల ని తిన్, కౌడగాని మల్లయ్య, సాద రాజేశ్, బందె ల రమేశ్, అచ్చె సంతోష్, దమ్మన్నపేటకు చెందిన గంజి రజినీకాంత్‌తో పాటు 20 మం ది ఉన్నారు. అలాగే గోరికొత్తపల్లి మండలాని కి చెందిన బీజేపీ నాయకులు, ముదిరాజ్ మ హాసభ మండల అధ్యక్షుడు తిరుపతితో పాటు కుల సంఘ నాయకులు పల్లెబోయిన నవీన్, సారంగం, ఓదెలు తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తమను వాడుకొని గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం తమను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోసం కష్టపడు తూ ఆర్థికంగా నష్టపోయామని, ఇప్పుడు తమను విస్మరించడంతో పాటు డబ్బులున్న వారిని పార్టీలోకి తీసుకుని పోటీలో నిలుపుతూ అన్యాయం చేస్తున్నాడన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ టేకుమట్ల మండల అధ్యక్షుడు సట్ల రవి, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల స్నేహలతానరేశ్, మాజీ ఎంపీటీసీ ఆ ది సునీతారఘు, గ్రామశాఖ అధ్యక్షుడు ఇండ్ల మల్లేశ్, నిరంజన్, రాజు, బండి భద్రయ్య, పిట్ట భిక్షపతి, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.