గిర్మాజీపేట, అక్టోబర్ 27: వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతుండడంతో రోజురోజుకూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మద్దతు పెరుగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిమ్మని సంతోష్, డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది శివనగర్‌లో ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నన్నపునేని వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ సర్కారు వెంటే తామంతా ఉంటామని, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నరేందర్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తూర్పు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కంటకి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తూర్పులో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిన్న, వంశీకృష్ణ, సోమాజీ నరేశ్, లడ్డు శేఖర్, హరీశ్, శివ, రాజేశ్, భరత్, రవి, శ్రీనివాస్, వినయ్, వంశీ, యుగంధర్, సల్మాన్, సాహిల్, ఇస్మాయిల్, ఇబ్రహీం, గౌస్‌పాషా, పుర్ఖాన్, ఆమన్, ఉస్మాన్, యాసిన్, ఇషాంక్, ససర్, అఫ్రోజ్, చోటు, రెహమాన్ పాల్గొన్నారు. అలాగే, ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే ప్రచార రథాలను ఎమ్మెల్యే నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు.
పోచమ్మమైదాన్: వరంగల్ 12వ డివిజన్ సెకండ్ డాక్టర్స్‌కాలనీ, మైనార్టీ కాలనీలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం పర్యటించారు. కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని పలువురు పెద్దలను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మసీదు మతపెద్దలు, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్, అధ్యక్షుడు సోల రాజు గణపతి, కార్యదర్శి కాశెట్టి వేణు, కాలనీ కమిటీ సభ్యులు మోసిన్, ఖాజామియా, గౌస్, యాకూబ్, అఫ్జల్, అక్బర్ పాల్గొన్నారు.
వరంగల్ ఎల్బీనగర్లోని ఖాదరియా మసీదులో గార్మీ వేడుకలకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, మతపెద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.