కేసముద్రం, జనవరి 6 : రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15వేలు ఇవ్వకుండా మోసం చే స్తూ రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోయిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బా నోత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం కేసముద్రం మార్కెట్ ఎదుట నిర్వహించిన ధర్నా ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా, రుణమాఫీ అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, రుణాలు మాపీ కాక పెట్టబడి సాయం అందక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిస్తే.. ఆ రైతుబంధును నిలిపివేసిన రేవంత్ రైతుల పాలిట శాపంగా మారాడని విమర్శించారు.
రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లే రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి రూ.ఒక్క లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన హా మీలను అమలు చేయకపోవడం వల్ల ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడం లేదని ఆరోపించారు.
హామీలను అమలుచేసేదాకా ప్రజల్లో ఉంటూ పోరాటా లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మండల అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్ నజీర్ అహ్మద్, కముటం శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ దీకొం డ వెంకన్న, మాజీ మండల అధ్యక్షుడు జాటోత్ హరీశ్‌నాయక్, మోడెం రవీందర్‌గౌడ్, గుడుగు కొమ్మన్న, నాయకులు ఊకంటి యాకుబ్‌రెడ్డి, సట్ల వెంకన్న, దార్ల రాంమూర్తి, గుగులోత్ వీరునాయక్, ఘనపారపు రమేష్, సంజీవ, అన్నెపాక వెంకన్న, కొమ్ము రాహుల్, గడ్డం యాకమూర్తి, లింగాల పిచ్చయ్య, బానోత్ వెంకన్న ఉన్నారు.