స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 : ఎమ్మల్యే కడియం శ్రీహరికి ఉప ఎన్నికలు వస్తాయన్న భయం పట్టుకుందిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో
నియోజవకర్గంలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడని రాజయ్య ఎద్దేవా చేశాడు.
గ్రామాలలో తిరుగుతూ ప్రెస్టేషన్ తోపాటు వయసు మీద పడి డిమెన్షియా, డిప్రెషన్ వంటి రుగ్మతలకు లోనై తను ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదని రాజయ్య విమర్శించారు. రైతులు సాగునీరు లేక, ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సమస్యలు పరిష్కరించకుండా, ఏం సాధించాడని నియోజకవర్గంలో పనుల జాతర కార్యక్రమాలు చేపడుతున్నాడో అర్థం కావడం లేదని రాజయ్య అన్నాడు.
పార్టీ శ్రేణుల తెల్ల బట్టలు వేసినా, ఒక వ్యక్తి ఎదిగినా ఓర్చుకోలేని కడియం నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. కడియం ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని రాజయ్య స్పష్టం చేశారు.
రైతుల పక్షాన ఈ నెల 31 పాదయాత్ర
నియోజకవర్గంలో దేవాదుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ పాలనలో మూడు లిఫ్ట్ లా ఏర్పాటుకు ఏర్పాటుకు రూ.104 కోట్లు మంజూరు చేసినప్పటికి ఇంత వరకు పనులకు అతీగతి లేదన్నారు. పనులు వెంటనే పూర్తి చేసి యాసంగికి సాగునీరు అందించాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలనే డిమాండ్లతో రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హన్మకొండ జిల్లా వేలేర్ మండలం నుండి గండిరామారం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రాజయ్య తెలిపారు.