జనగామ చౌరస్తా, జనవరి 11 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు రాజ్‌కుమార్‌ను శనివారం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన రాజ్‌కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనే వాస్తవాన్ని, తండాల్లోని ప్రజల అభిప్రాయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్ర సారం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపించిందన్నారు. వెంటనే అక్రమ కేసును ఉపసంహరించుకొని అతడిని విడుదల చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తన పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత కొట్టిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో భూములు ఇవ్వమన్న లగచర్ల అమాయక గిరిజన రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిందన్నారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని కొండాపురంకు చెందిన కాంగ్రెస్ గిరిజన నాయకుడు శ్రీనివాసుపై సొంత పార్టీ నాయకులే పీఎస్‌లో కేసు పెట్టించి పోలీసులతో కొట్టించగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు అతడు మరణ వాంగ్మూలంలో వెల్లడించినా ప్రభు త్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
తొర్రూరుకు చెందిన ఓ గిరిజన యువకుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా తండాల్లో ప్రచారం చేశాడని, పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు అతడిపై కేసు పెట్టించి కొట్టించారన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గమైన పాలన చూడలేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. అయితే అమాయక ప్రజలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి హెచ్చరించారు.
పాలకుర్తి : యూట్యూబ్ జర్నలిస్టు రాజ్‌కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరే క విధానాలను ప్రశ్నిస్తే ఆక్రమ కేసులు బనాయించి జైలు కు పంపుతారా? అని ప్రశ్నించారు. తక్షణమే గిరిజన యు వకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి నియోజక వర్గంలోని గిరిజనులపై కక్షకట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే కేసుల మీద కాకుండా అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాలకుర్తి పోరాటాల గడ్డ అని ఎమ్మెల్యేపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాగా, ధర్నా సం దర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎస్సై దూలం పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో కొడకండ్ల, దేవరుప్పుల, రాయపర్తి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు సిందె రామోజీ, తీగల దయాకర్, నునావత్ నర్సింహనాయక్, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌నాయక్, జినుగు అనిమిరెడ్డి, బొబ్బల అశోక్‌రెడ్డి, బానోత్ మహేందర్, బిల్లా సుధీర్‌రెడ్డి, ఆకుల సురేందర్‌రావు, మాచర్ల ఎల్లయ్య, ఏలే సుందర్, కొత్త జలేంధర్‌రెడ్డి, గండిపెల్లి యాకయ్య, పేరం రాము, కొల్లూరు సోమయ్య, కారుపోతుల వేణు, చింత రవి, మేకల సంపత్, గడ్డం రాజు, వంగ అర్జున్, కోతి ప్రవీణ్, జోగు గోపి, చెంచు రాజిరెడ్డి, దీకొండ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
లగచర్ల రైతుల అక్రమ అరెస్ట్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వ దమన నీతిని ఎండకడుతూ తన ఛానల్లో ప్రసారం చేసినందుకే యూట్యూబ్ జర్నలిస్టు రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు రాజ్ కుమార్‌ను సబ్ జైల్లో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాలను నిగ్గు తేల్చే ప్రజా గొంతుకలను జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. గిరిజన జర్నలిస్టును అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పసుల ఏబేల్, జూకంటి శ్రీశైలం, ఉడుగుల నర్సింహులు, యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
-ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి