పర్వతగిరి ఏప్రిల్ 11 : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పిన గురువు రంగారావు మృతి చెందగా వారి భౌతిక కాయానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. గురువు అంత్యక్రియలలో భాగంగా అంతిమయాత్రలో పాడేమోసి తన గురు భక్తిని చాటుకున్నారు. కాగా, పర్వతగిరికి చెందిన బోయినపల్లి రంగారావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చదువు నేర్పిన చిన్నప్పటి గురువు. మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Egg price | అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. ఎంతో తెలిస్తే షాకే..!
Watch: మహిళ, ఆమె కుమార్తెను దారుణంగా కొట్టిన ఇద్దరు.. తర్వాత ఏం జరిగిందంటే?