ఐనవోలు/ రాయపర్తి/ వర్ధన్నపేట/ పర్వతగిరి, డిసెంబర్ 9 : పల్లె పోరులో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఐనవోలు మండలం రాంనగర్ తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి శ్రీనివాస్, యాదవ సంఘం అధ్యక్షుడు కాయిత కుమారస్వామి, ఎస్సీ సంఘం నాయకులు ఈద భిక్షపతి, ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యుడు ఆకులపల్లి ఎలేంద్రలతో పాటు సుమారు 50 కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ మేరకు ఎర్రబెల్లి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అలాగే రాయపర్తి మండల కేంద్రంతో పాటు మైలా రం, శివరామపురం, వర్ధన్నపేట మండలం ఇల్లంద, నల్లబెల్లి, పర్వతగిరి మండలకేంద్రం చింతనెక్కొండ, అన్నారం షరీప్, బూరుగుమళ్ల గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పం చ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించా రు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడారు. ప్రతి కార్యకర్త సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ లాంటి మహానుభావుడని కాదనుకొని.. ఒక దుర్మార్గుడి చేతితో రాష్ర్టాన్ని పెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ హ యాంలో రాజుగా బతికిన రైతులు కాంగ్రెస్ పాలనలో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మార్పు పేరుతో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిలువు దోపిడీతోపాటు కష్టాలకు గురి చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నదని తెలిపారు. పుట్టిన ఊరు పర్వతగిరిలో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటే బీఆర్ఎస్ బల పరిచిన మాడుగుల రాజును గెలిపించాలని ఉషాదయాకర్‌రావు కోరారు.
ప్రచారంలో రాంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఈధ స్వరూప, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉల్లెంగుల అశో క్, నాయకులు భూమిని రాజిరెడ్డి, ఆకులపల్లి సాగర్, కోతి శ్రీనివాస్, జున్ను ఐలయ్య, పెరుమాండ్ల సదానందం, సూ రయ్య, ఎండీ యాకుబ్, సంపత్, మధుకర్, రాజు, యాక య్య, నరేశ్, అనిల్, రాయపర్తి మండల ఎన్నికల ఇన్చార్జిలు గుడిపూడి గోపాల్‌రావు, జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల కన్వీనర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, రంగు కుమార్, గారె నర్సయ్య, మహ్మద్ అక్బర్, బందెల బాలరాజు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పర్వతగిరి మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, గోనె సంపత్, జయ, తదితరులు పాల్గొన్నారు.