మహదేవపూర్, సెప్టెంబర్ 14 : ఎగువన కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శనివారం బరాజ్ 5,25,930 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం 6,07,700 క్యూసెక్కులకు చేరుకుంది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత వరద ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 94.90 మీటర్ల ఎత్తులో ఉందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, మండలంలోని కాళేశ్వరం వద్ద సుమారు 7.9 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉంది.