మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి కురవి మండలం నేరడలో కేజీబీవీ పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయుల ఆటోను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. కేజీబీవీ ఉపాధ్యాయులైన సింధుజ, కళావతి, రాధ, స్వరూప, శైలజ వివిధ మండలాల నుంచి వచ్చి ప్రతిరోజు ఆటోలు నేరడ కేజీబీవీ విద్యాలయానికి వెళ్తుంటారు.
ఈ క్రమంలో శుక్రవారం శనిగపురం శివారు బోరింగ్ తండా వద్ద ఇసుక లోడుతో వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొంది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ తో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక ఉపాధ్యాయురాలు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.