పర్వతగిరి మార్చి 10 : పర్వతగిరి మండల కేంద్రంలోని పోలకమ్మా చెరువు కట్టమీద బైక్ అదుపుతప్పి(Bike accident) కల్లెడ గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాపు యజమాని దుగ్యాల వసంతరావు సోమవారం దుర్మరణం చెందాడు. పర్వతగిరి ఎస్ఐ భోగం ప్రవీణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లెడ గ్రామానికి చెందిన వసంతరావు తన ద్విచక్ర వాహనం పై పర్వతగిరి వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో పోలకమ్మ చెరువు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువు కట్ట మీద గల రైలింగ్ కి గుద్దుకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో వసంతరావు తలకి బలమైన గాయమై చెరువులో పడిపోయి మృతి చెందాడు. మృతుడి కూతురు జూలపల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వసంతరావు మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.