Rythu Bandhu | ములుగు, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏటా ప్రభుత్వం రైతులకు వానకా లం పంటకు రూ.5వేలు, యాసంగి పంటకు రూ.5వేల చొప్పున ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. తొలివిడుతలో చిన్న, సన్నకారు రైతుల్లో సొ మ్ము జమ కానుంది. ములుగు వ్యాప్తంగా 76,692 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సీజన్‌కు ముందే పంట పెట్టుబడి సాయం అందుతుండటంతో వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్దమవుతున్నారు.
జిల్లాలో 76,692మంది రైతులకు రూ.79కోట్ల 18లక్ష 74,092 పెట్టుబడి సాయం అందనున్నది. ఇందులో ములుగు మండలంలోని 17,962 మంది రైతులకు రూ.16కోట్ల 36లక్షల 22,136, వెంకటాపూర్‌లో 10,956 మందికి రూ.11కోట్ల 1లక్ష 877, గోవిందరావుపేటలో 5,927మందికి రూ.6 కోట్ల 92లక్షల 7039, ఏటూరునాగారంలో 6,522 మందికి రూ.6కోట్ల 11లక్షల 83వేల 696 రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. తాడ్వాయి మండలంలో 5,017మందికి రూ.5కోట్ల 53లక్షల 44,794, మంగపేటలో 8,724మందికి రూ.12కోట్ల 24లక్షల 1359, కన్నాయిగూడెంలో 4,580మందికి రూ.4కోట్ల 45లక్షల 5342, వాజేడులో 9,904మందికి రూ.9కోట్ల 24లక్షల 47,547, వెంకటాపురం(నూగూరు) మండలంలో 7,910 మందికి రూ.8కోట్ల 34లక్షల 61,302 జమ చేయనున్నారు.
వానకాలం పంట పెట్టుబడికి రైతుబంధు పథకాన్ని అర్హులకు వర్తింపజేసేందుకు కార్యాచరణ రూపొందించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి తొలి విడుతలో చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలు నిర్ణీత గడువులోగా అందరి ఖాతాల్లో నేరుగా రైతుబంధు సాయాన్ని జమ చేస్తాం. ఈ నెల 16 వరకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోని రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించాలలి. ఏఈవోలకు పట్టా పాస్ బుక్, ఆధార్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లను దరఖాస్తు ఫారంకు జతచేసి ఇవ్వాలి.
– గౌస్‌హైదర్, ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి