ఆ దర్శకుడికి ఓకే చెప్పాడా?
ఏపీలో ఎన్నికల హడావిడి ముగియగానే, ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేశారు పవన్‌కల్యాణ్. ఓ స్టార్ హీరో ఎనిమిది నెలల్లో మూడు సినిమాలు విడుదల చేయడమంటే ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు.
ఏపీలో ఎన్నికల హడావిడి ముగియగానే, ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేశారు పవన్‌కల్యాణ్. ఓ స్టార్ హీరో ఎనిమిది నెలల్లో మూడు సినిమాలు విడుదల చేయడమంటే ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. త్వరలో ఆయన సురేందర్‌రెడ్డి సినిమాను పట్టాలెక్కించనున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కి ఇచ్చినట్టే ఈ సినిమాక్కూడా కాల్షీట్స్ 45 రోజులే ఇచ్చారట పవర్‌స్టార్. ఇకనుంచి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్‌కల్యాణ్ నిర్ణయం. అందులో భాగంగా సురేందర్‌రెడ్డి సినిమాతో పాటు మరో ప్రాజెక్టుకు కూడా లైన్లో పెట్టేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పవన్‌కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్‌రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇటీవలే ఆయన కథ కూడా వినిపించినట్టు టాక్. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు మోహన్‌రాజానే దర్శకుడు. అలాగే రామ్‌చరణ్ ‘ధృవ’కు మాతృక అయిన ‘తని ఒరువన్’కూ దర్శకుడు మోహన్‌రాజానే. ైస్టెలిష్ మేకర్ అనే పేరుతో పాటు.. సినిమాను వేగంగా పూర్తి చేస్తాడనే గుడ్‌విల్ కూడా మోహన్‌రాజాకు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్‌కు కావాల్సింది కూడా అదే. కాబట్టి ఈ సినిమా దాదాపు ఖరారైనట్టే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

