గద్వాల, మార్చి 17 : ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చారు. నీట్ ప్రిపేర్ అవుదామని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడానికి అయిజ నుంచి ఇద్దరు విద్యార్థు లు ఉదయం గద్వాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నారు. రైలు ఆలస్యంగా వస్తుందని తెలియడంతో గద్వాలలో ఉన్న తన మిత్రుడికి ఫోన్ చేశారు. ముగ్గురు కలిసి రైల్వేస్టేషన్ నుంచి బైక్‌పై టీ తాగుదామని వచ్చారు. ఈ క్రమంలో అయిజ నుంచి గద్వాల వెళ్తున్న బస్సు వీరిని ఢీకొట్టడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలైన ఘటన గద్వాల రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం చోటు చేసుకున్నది.
బాధితుల కథనం ప్రకారం అయిజ పట్టణానికి చెందిన రామాంజనమ్మ, మల్లేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. రాము (18) వీరికి రెండో సంతానం. మల్లేశ్ అయిజలో వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. రాము హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ పూర్తి చేసుకున్నాడు. అలాగే మిట్టదొడ్డి గ్రామానికి చెందిన నాగరాజు అయిజలో నివాసం ఉంటున్నాడు. వారి కుమారుడు విష్ణు కూడా నీట్ కోచింగ్ నిమిత్తం రాముతో కలిసి మంగళవారం ఉదయం గద్వాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
రైలు ఆలస్యంగా ఉందని తెలియడంతో గద్వాలలోని గంజిపేటలో ఉన్న తమ మిత్రుడు వర్ధన్‌కు ఫోన్ చేశారు. అతను రైల్వే స్టేషన్‌కు చేరుకోగా ముగ్గురు కలిసి టీ తాగుదామని స్టేషన్ నుంచి బయటకు రాగా బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడిక్కడే మృతి చెందగా విష్ణు, వర్దన్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సం నిమిత్తం కర్నూల్‌కు తరలించారు. విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలలు నిరాశ చేసి కొడుకు మృతి చెందడంతో ఆకుటుంబం యొక్క రోధన అందరిని కలచి వేసింది.
న్యాయం చేయాలని ఆందోళన
తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతిడి కుటుంబసభ్యులతోపాటు గాయపడిన విద్యార్థి కుటుంబాల స భ్యులు జిల్లా దవాఖాన సమీపంలో రోడ్డుపై కూర్చోని అరగంట పాటు ధర్నా చేశారు. ఉదయం ప్రమాదం జరిగితే ఎవరూ పట్టించుకోవడం లేదని బస్సు, డ్రైవర్‌తో పాటు యజమాని వచ్చి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని మృతుడి బంధువు లు ధర్నా చేశారు. ధర్నా నిర్వహించే సమయంలో పోలీసులకు బాధిత కు టుంబాల మధ్య వాగ్వివాదం చోటు చే సుకున్నది. తమకు న్యాయం చేసే వర కు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డు పై బైఠాయించారు.
సీఐ శ్రీనివాసులు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ప్ర మాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశామని, బాధితులకు న్యాయం చేసే విధం గా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నా విరవించారు.
విష్ణు పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు..
అయిజ, మార్చి17 : జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విష్ణు పరిస్థితి విషమంగా ఉందని కు టుంబ సభ్యులు తెలిపా రు. గట్టు మండలం, మి ట్టదొడ్డి గ్రామానికి చెంది న విష్ణు తల్లిదండ్రులు అయిజ పట్టణంలోనే నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నా రు. ప్రస్తుతం విష్ణు కోమాలో ఉండటం తో హైదరాబాద్‌లోని వాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.