తొర్రూరు, మార్చి 8 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాగులో ఎప్పుడూ నీరు ఉండేదని, దీంతో సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని గుర్తు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి తక్షణమే స్పందించి ఆకేరు వాగులోకి నీటి విడుదల కోసం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.