శాయంపేట, నవంబర్ 5 : తుపాను ప్రభావంతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కోరారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు దాటినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పంటలను పరిశీలించలేదని, రేవంత్‌రెడ్డి సరారులో రైతుల కన్నీళ్లు తుడిచే వారు లేరా? అని ఆయన ప్రశ్నించారు. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేటలో దెబ్బతిన్న పం టలను సిరికొండ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ స రారు అన్ని వర్గాలను అధోగతి పాలు చేసిందన్నా రు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి, మిరప ఇత ర పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ అధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ల కళ్లల్లో కన్నీళ్లు చూడటం ఎవరికి మంచిది కాదని, కలెక్టర్, అధికారులు వెంటనే పంటలు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతులు బాధలో ఉంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని దుస్థితిలో రేవంత్ సరార్ ఉందని, పిల్లలకు సర్టిఫికెట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల్లో సీఎంపై నమ్మ కం పోయిందని, రైతులను పట్టించుకోకపోతే ప్రభుత్వంపై ఎంత ఒత్తిడికైనా సిద్ధంగా ఉంటామన్నారు.
పదేళ్లు బంగారు పాలనను కేసీఆర్ అందించారని, కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలిచ్చి గద్దెనెకి ప్రజలను మోసం చేసిందని దుయ్యబడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని స్పష్టం చేశా రు. రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న భావన వారిలో లేదన్నారు. రేవంత్‌రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని, యూరియా కోసం రైతులు పడిన గోసకు పరిహారం తప్పదని హెచ్చరించారు. గాలివానకు పూర్తిగా వరిపంట నీట మునిగి మొలకెత్తుతున్నదని, అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ హయాం లో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి రైతులకు అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. వెంటనే పంటలు నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సిరికొండ డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గుర్రం రవీందర్, బగ్గి రమేశ్, అడుప ప్రభాకర్, నిమ్మల మహేందర్, బేరుగు తరుణ్ గోపి, దుంపల మహేందర్‌రెడ్డి, కొమ్ముల శివ తదితరులున్నారు.