పరకాల, జూలై 17: యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. వారం రోజులు తిరిగినా రెండు బస్తాల యూరియా దొరకని పరిస్థితి హనుమకొండ జిల్లా పరకాల మండలంలో నెలకొంది. చెప్పులు క్యూలో పెట్టి రైతులు నిరీక్షించారు. ఇన్ని తిప్పలు పడ్డా యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందారు.
గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో మండలంలోని రైతులు వ్యవసాయ మారెట్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నిర్వాహకులు క్యూలో నిలబడాలని సూచించారు. ఒకపక్క ఎండ తీవ్రత ఎకువగా ఉండడం.. మరో వైపు భారీగా రైతులు రావడంతో చెప్పులను క్యూలో పెట్టి వేచి చూశారు. ఎట్టకేలకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు.