ఆత్మకూరు, జూన్16 : తమకు ఇంత వరకు రుణమాఫీ కాలేదని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతు దంపతులు కదరిక సాంబయ్య, పద్మ కలెక్టర్ స్నేహా శబరీష్కు మొరపెట్టుకున్నారు.
సోమవారం సాయంత్రం ఆత్మకూరులోని రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆమెను కలిసి తమ గోడు వెళ్లబోసుకొని వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఏవో యాదగిరిని ఆదేశించారు.