28 క్వింటాళ్లే కొంటాం !
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నా రు. ఓ వైపు పంట కాలంలో యూరియా అందక ఇబ్బందులు పడి.. అరకొరగా పండిన పంటను సైతం అమ్మాలం టే ఇబ్బందులు తప్పడం లేదు.
- మకల కొనుగోళ్లపై రైతులకు ఆంక్షలు.. అధిక దిగుబడి వచ్చినా కొనేందుకు నిరాకరణ
- పెద్దవంగర మండలంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్వాకం
- ఇబ్బంది పడుతున్న రైతులు
పెద్దవంగర, ఏప్రిల్ 10 : కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నా రు. ఓ వైపు పంట కాలంలో యూరియా అందక ఇబ్బందులు పడి.. అరకొరగా పండిన పంటను సైతం అమ్మాలం టే ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో 5వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగు చేశారు.
ప్రభు త్వం ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయి తే ఎకరాకు కేవలం 28 క్వింటాళ్ల వరకే కొంటామని నిర్వాహకులు ఆంక్షలు విధిస్తున్నారు. యాసంగిలో అనుకూల పరిస్థితులతో దిగుబడి అనుకున్నదానికంటే ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అధికారులు మాత్రం పాత లెకల ప్రకారం పంట కొనుగోలుకు పరిమితం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంట దిగుబడిన అంచనా వేయకుండా ఆంక్ష లు విధించడం ఏంటని, మిగిలిన పంట ఎకడ అ మ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు.
వ్యవసాయ, మారెఫెడ్ అధికారుల మధ్య సమన్వయ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నమోదు ఆధారంగానే కొ నుగోలు చేస్తామని చెప్తూ అధికారులు తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎకరాకు కేవలం 28 క్విం టాళ్లు మాత్రమే కొంటామని తెగేసి చెప్తుండడంతో రైతులు దికుతో స్థితిలో ఉన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారి స్వామిని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నమోదు ఆధారంగా కొనుగోలు చేస్తామంటున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

