పరిమితి మించితేనే..
‘పామాయిల్' మాట వినిపించగానే చాలామంది విష తుల్యంగా భావించి దాంతో చేసిన ఆహారాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అంతలా ప్రభావితం చేశారు మరి నేటి సోషల్‌మీడియా సైంటిస్టులు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
‘పామాయిల్’ మాట వినిపించగానే చాలామంది విష తుల్యంగా భావించి దాంతో చేసిన ఆహారాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అంతలా ప్రభావితం చేశారు మరి నేటి సోషల్‌మీడియా సైంటిస్టులు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక నూనె ఆరోగ్యకరమా కాదా అనేది నూనె పేరును చూసి కాకుండా.. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం.. ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.
పామాయిల్ విటమిన్-ఇ తోపాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అలా అని పరిమితికి మించి తీసుకోమని కాదు. అన్ని రకాల నూనెలను మారుస్తూ, పరిమిత మోతాదులో వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక రకమైన నూనెను మంచిదని, మరోదాన్ని చెడ్డదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరైన విధానం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన సమతుల ఆహారం, తక్కువగా వేయించిన పదార్థాలు, నూనెను నియంత్రించి వాడటమే ఆరోగ్యానికి అసలు మంత్రం అని గుర్తుచేస్తున్నారు.
ఆహారంపై నిర్ణయాలు తీసుకునే ముందు సోషల్ మీడియా ట్రెండ్స్‌ను కాకుండా సైంటిఫిక్ ఆధారాలను నమ్మాలని వైద్యులు సూచిస్తున్నారు. వస్తున్న ప్రతి కంటెంట్‌ను నమ్మి, యదార్థాలను సరిచూసుకోకుండా, వారి విద్యార్హతతో సంబంధంలేని అంశాలను భయంతో ఫాలో అవ్వడం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్క పదార్థాన్ని చూసి తీర్పు చెప్పడం కాదు… మొత్తం ఆహారపు జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అని గ్రహించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

