శనగపప్పు: ఒక కప్పు, మినుప పప్పు: అర కప్పు, తరిగిన తోటకూర: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, జీలకర్ర: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
శనగపప్పు, మినుప పప్పును బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పుల్ని బరకగా, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పప్పు ముద్ద, తోటకూర తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెపోసి, బాగా వేడయ్యాక పప్పు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అర చేతిలో గారెల్లా ఒత్తి నూనెలో దోరగా కాల్చుకుంటే వేడివేడి తోటకూర గారెలు సిద్ధం.