హైదరాబాద్, ఆట ప్రతినిధి : క్రికెటర్గా రాణించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆ కెరీర్ను కొనసాగించలేక ఇతర రంగాల్లో స్థిరపడిన వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్)ను ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి తెలిపారు. ఇందులో తొలి ప్రయత్నంగా ఈ నెల 7వ తేదీ నుంచి రెనోవా మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ (ఎంఎస్ఎల్) నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.
ఈ లీగ్ విన్నర్ ట్రోఫీని సినీ నటుడు అలీ ఆవిష్కరించారు. ఐదు రోజుల పాటు జరిగే టోర్నీలో కేఎల్ఆర్ ట్రాన్స్ఫార్మర్స్, మా స్పేసెస్, రేజింగ్ బుల్స్, జూపర్ ఎల్ఈడీ బుల్లెట్స్, సన్క్రెస్ట్ వారియర్స్, టెర్మినస్, రీట్ మేవరిక్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.