Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
Sabitha Indrareddy | మూసీ నీళ్లు మొత్తం నీళ్లు గండిపేటకు పోయి చేరుతున్నయి.. ముఖ్యమంత్రే చాలా గొప్పగా చేస్తమని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నరు.. వికారాబాద్ మూలంగా శుభ్రంగా ఉన్న మూసీని మురికికూపం చేయడానికి ఇక్కడి నుంచే మొదలుపెడుతున్నరని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
Sabitha Indra Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఇతర బీఆర్ ఎస్ నాయకులతో కలిసి వికారాబాద్ పరిధిలోని మూసీ ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెబుతున్నరు.. మూసీని సుందరీకరణ చేస్తానని, మూసీలోకి మురికినీళ్లు రాకుండా చేస్తానని గత రెండు సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నామని అన్నారు.
. 50 వేల కోట్ల రూపాయలు పెట్టి మూసీని బాగు చేస్తాననే మాట మాట్లాడుతున్నడు.. మూసీ అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వికారాబాద్‌ను గుర్తు చేసుకుంటం. వికారాబాద్‌లో పుట్టిన మూసీ కలుషితమైపోయి కిందంతా మురికినీళ్లు పారుతున్నయని మాట్లాడుతున్న సందర్భంలో వికారాబాద్‌లో ఉన్న STP రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉందని.. అధికారులు కానీ, స్థానికంగా ఉన్నవాళ్లు కానీ, ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎందుకు ఆలోచించడం లేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
మూసీ నీళ్లు ఎక్కడికిపోతున్నయి చూస్తే.. మొత్తం నీళ్లు గండిపేటకు పోయి చేరుతున్నయి.. ముఖ్యమంత్రే చాలా గొప్పగా చేస్తమని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నరు.. వికారాబాద్ మూలంగా శుభ్రంగా ఉన్న మూసీని మురికికూపం చేయడానికి ఇక్కడి నుంచే మొదలుపెడుతున్నరని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పక్కనున్న రైతన్నలందరినీ అడుగుతున్నారు.. రైతులు బోర్లు వేస్తే మురికి నీళ్లు వచ్చి.. అవే మురికినీళ్లతో పంటలు పండించడం.. మూసీ ద్వారా పోతున్న పక్కనున్న పొలాలన్నీ కూడా ఇవే నీళ్లు వాడుకుని కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నరు.. ఆ కూరగాయలు పండినా… మురికినీళ్లతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తయన్నారు. మూసీని బాగు చేస్తానన్న ముఖ్యమంత్రి మూలాన్ని మరిచిపోయారని గుర్తుచేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
మూసీని సుందరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి రెండేళ్ల నుండి చెప్తున్నాడు, కానీ వికారాబాద్‌లో ఉన్న STP రిపేర్‌లో ఉంది దాన్ని బాగు చేయాలని ఎందుకు ఆలోచించడం లేదు?
డ్రైన్ నీళ్లు మూసీలో పోయి అవన్నీ గండిపేట చెరువులో కలుస్తున్నాయి
మూసీ పక్కన ఉన్న రైతులు బోర్లు వేస్తే మురికి నీళ్లు వస్తున్నాయి
మూసీని బాగు చేస్తానన్న రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయాడు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
Apprentice | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 409 అప్రెంటిస్ ఖాళీలు
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

