Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Cruise Ship: డాకింగ్ చేసిన క్రూయిజ్ షిప్‌ను ఓ ట్యాంకర్ నౌక ఢీకొన్నది. అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ పోర్టులో ఈ ఘటన జరిగింది. మిసిసిపి నదిలో డాకింగ్ చేసిన ప్రయాణికుల నౌకను ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రయాణికులు లగ్జరీ షిప్ నుంచి నదిలోకి దూకారు.
న్యూయార్క్: డాకింగ్ చేసిన క్రూయిజ్ షిప్‌ను ఓ ట్యాంకర్ నౌక ఢీకొన్నది. అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ పోర్టులో ఈ ఘటన జరిగింది. మిసిసిపి నదిలో డాకింగ్ చేసిన ప్రయాణికుల నౌకను ట్యాంకర్ ఢీకొట్టింది. బలంగా ఢీకొనడంతో క్రూయిజ్ బోల్తాపడింది. ఆ సమయంలో ప్రయాణికులు నది నీటిలోకి దూకారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందిని రక్షఙంచారు. సుమారు 32 మందిని ఆస్పత్రికి తరలించారు. అమెరికన్ హెరిటేజ్ అనే క్రూయిజ్ షిప్లో సుమారు 180 మంది ఉన్నారు. అట్లాంటిక్ అస్పాల్ట్ అనే ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని తెలిసింది.
ట్యాంకర్ నౌక స్టీరింగ్ పట్టు తప్పడంతో క్రూయిజ్ వెసల్‌ను ఢీకొన్నది. భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నదిలో దూకిన అనేక మందిని రక్షించారు. ప్రయాణికులను రెస్క్యూ చేస్తున్న సమయంలోనే క్రూయిజ్ షిప్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో నదిలో వాతావరణం 19 డిగ్రీలు ఉన్నది. వాస్తవానికి ప్రమాదానికి గల సరైన కారణం తెలియదు, కానీ ట్యాంకర్ స్టీరింగ్ కోల్పోయి ఉంటుందని కోస్టు గార్డు కెప్టెన్ మెలానే బర్న్‌హమ్ తెలిపారు.
🚨New: Stunning video shows the American Heritage river cruise ship sinking into the Mississippi River in New Orleans after colliding with the Atlantic Asphalt tanker.
Passengers can be seen jumping into the water as the vessel goes down. https://t.co/LawoGiJH1H
— The Calvin Coolidge Project (@TheCalvinCooli1) November 13, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

