వైభవ్ వెయిట్ చేయాల్సిందే!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పేట్టు లేదు. మంచి ఫామ్‌లో ఉన్న అతడిని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిస్తారా? లేక ఓపెనర్లుగా అభిషేక్-సంజూనే కొనసాగిస్తారా? అని చర్చలు సాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లక్నో: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పేట్టు లేదు. మంచి ఫామ్‌లో ఉన్న అతడిని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిస్తారా? లేక ఓపెనర్లుగా అభిషేక్-సంజూనే కొనసాగిస్తారా? అని చర్చలు సాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ స్పందిస్తూ.. ‘ఇది నాక్కూడా కొత్త అనుభవమే. అతడు (వైభవ్) మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ జట్టులో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న నైపుణ్యం కల్గిన ఆటగాళ్లను తీసేసి ఉన్నఫళంగా అతడిని తీసుకోవడం కరెక్ట్ కాదు.
ఈ విషయాన్ని నేను వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పా. అతడు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ వైభవ్‌ను ఆడించాల్సి వస్తే అభిషేక్, సంజూలలో ఎవరిని తప్పించాలన్నది చాలా కష్టమైన ప్రశ్న. గత రెండేండ్లుగా మెరుగ్గా ఆడుతున్న ఈ జోడీని మూడు, నాలుగు మ్యాచుల్లో సరిగ్గా ఆడలేదని, అదీగాక ఒక యువ ఆటగాడి కోసం తప్పించడం సరైన నిర్ణయం కాదు’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపిక విషయంలో మ్యాచ్‌కు తగ్గట్టు పరిస్థితులను బట్టి కెప్టెన్, కోచ్ నిర్ణయాలు తీసుకుంటారే తప్ప సోషల్ మీడియా ఒత్తిడితో టీమ్‌ను ఎంపిక చేయబోమని గౌతీ నొక్కిచెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

