ఆకుకూరలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి. అయితే ఆకుకూరల్లో దేనికదే ప్రత్యేకం అయినప్పటికీ తోటకూర చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటుంది.
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. ఇది మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని సీజన్లలోనూ ఎప్పుడంటే అప్పుడు లభిస్తుంది. పైగా చవకగా కూడా ఉంటుంది.