4 నెలల్లో 59 మందికి రాజ్యసభ వీడ్కోలు
వచ్చే నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులతో ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ప్రధా ని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఫొ టో సెషన్ నిర్వహించారు.
- ఏప్రిల్-జూలై మధ్య ముగియనున్న పదవీకాలం
- రాజ్యసభ సభ్యులతో ప్రధాని ఫొటో సెషన్
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేశ్‌రెడ్డి హాజరు
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వచ్చే నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులతో ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ప్రధా ని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఫొ టో సెషన్ నిర్వహించారు. వారితో కలిసి గ్రూ ప్ ఫొటోలు దిగారు. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో 59 మంది రాజ్యసభ సభ్యు ల పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యం లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పదవీ విరమణ చేయనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ సహా ఇతర సభ్యులతో ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రు లు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, రాందాస్ అథవాలే, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీఈసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితర నేతలు ఈ ఫొటో సెషన్లో పాల్గొన్నారు
కేఆర్ సురేశ్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు
రాజ్యసభలో పదవీ విరమణ పొందనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డికి బుధవారం బీఆర్ఎస్ ఎంపీలు సహా పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆయనతో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. సభలో సురేశ్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఆయన వెనుక ఒకే సీటులో కూర్చొన్నారు. అనంతరం కేఆర్ సురేశ్‌రెడ్డితో పాటు పదవీ విరమణ చేయనున్న సభ్యులకు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, సహచర ఎంపీలు కరచాలనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

