సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో బుధవారం తెల్లవారుజామున, సాయంత్రం వేళ తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 8గంటల వరకు నగరంలోని ఉప్పల్, అల్వాల్, షేక్‌పేట ప్రాంతాల్లో 3 మి.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ద్రోణి ప్రభావంతో ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 28.4, కనిష్ఠం 18.5 డిగ్రీలు, గాలిలో తేమ 54 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.