హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంగీకరించారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండోసారి అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని, పేపర్ లీక్ అంశంపై కేంద్రం సీరియస్‌గా ఉన్నదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకున్నదని, ఘటనకు బాధ్యులైన 17 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. దీనికి కేంద్రమంత్రి ప్రధాన్ రాజీనామా ఒకటే పరిషారం కాదని పేర్కొన్నారు. కొ న్ని రోజులుగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం అని వాపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీకి గుర్తుందా? అని నిలదీశారు.