Nivin | మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు నివిన్ పౌలి (Nivin Pauly), టొవినో థామస్ (Tovino Thomas). కొన్ని సంవత్సరాలుగా ఎవరికి వారే సినిమా పరిశ్రమలో ఎదుగుతూ, భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ వారి బంధం గురించి సినిమా పరిశ్రమలో ఎప్పుడూ చెప్పుకోలేదు. నివిన్ పౌలి ఇప్పుడు వారి బంధం గురించి వెల్లడించారు. నివిన్ యెజు కాదల్ యెజు మలై (Yezhu Kadal Yezhu Malai ) సినిమా ప్రమోషన్లో భాగంగా టొవినో థామస్తో తనకున్న సంబంధం గురించి వెల్లడించారు.
నేను, టొవినో ఒకరికొకరు సోదరులు (Cousin’s) అవుతారు. టొవినో తండ్రి చిన్న చెల్లెలిని (మేనత్త) నివిన్ తండ్రి తమ్ముడికి (బాబాయ్) ఇచ్చి వివాహం చేశారు. అలాగే నివిన్ తండ్రి, టొవినో తల్లి కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. దీంతో బాల్యం నుంచే మా కుటుంబాలు పలు సందర్భాల్లో కలుసుకునేవి.
బంధువులైనప్పటికీ మేమిద్దం కలిసి ఏ చిత్రంలో నటించలేదు. కానీ సినిమాకు సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలపై కలిసి చర్చించుకునేవాళ్లం. టొవినో కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉంది. కేరళలో టొవినో భారీగా అభిమాన గణాలను సంపాదించుకున్నారు. ప్రజాదరణ పొందుతున్నారు. టొవినో నిటిస్తున్న లోక 2తో సహా ఇతర సినిమాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నివిన్ తన సినీ కెరీర్లో విజయంతంగా రాణిస్తున్నాడు. అతడు నటించిన సర్వం మాయ సినిమా హిట్గా నిలిచింది. అదేవిధంగా గిరీశ్ ఏడీ డైరెక్టర్లో వచ్చిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) భారీ హిట్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. రామ్ డైరెక్షన్లో సూరితో కలిసి నివిన్ నటించిన యెజు కాదల్ యెజు మలై సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందన లభించింది.

Bethlehem