పెద్దవంగర, మే12: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దవంగర మండలం రామోజీ తండాకు చెందిన గూగులోతు కిషన్ (45) వడ దెబ్బతో మరణించాడు. కిషన్ తనకు తనకున్న రెండు ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకచ్చాడు. గత పది రోజులుగా సెంటర్ వద్దనే వేచి ఉన్నాడు.
అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రోజు కొనుగోలు కేంద్రం వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురైన కిషన్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందారు. మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో అందించి న్యాయం చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.