Fake Swamijis | పెద్ద వంగర, ఫిబ్రవరి 22 : దొంగ స్వాములు ఉప్పరగూడెం గ్రామంలో హల్ చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బురిడీ కొట్టింటి బంగారం, నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సముద్రాల శోభా తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు స్వామి వేషధారణలో భిక్షాటనకు వచ్చిన ఇంట్లోకి రావడం జరిగిందన్నారు.
ఆ సమయంలో నా కుమారుడు కార్తీక్ స్నానం చేస్తున్నాడు. దొంగ స్వాములైన సదరు వ్యక్తులు భిక్షాటనకు వచ్చి కుమారుడిని స్కూల్‌కి పంపించి వచ్చే సమయంలో తనను వెంబడిస్తూనే ఉన్నారని చెప్పింది. తాను ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి కుటుంబ సమస్యలు అంటూ చెప్పుకుంటూనే ఏదో మాయ చేయడంతో తాను స్పృహ తప్పి పడిపోయానంది. ఈలోగా స్పృహ నుంచి మెలకువ రాగానే ఒంటిపై గల బంగారంతోపాటు ఇంట్లోనే నగదు సైతం దోచుకెళ్లారని వెల్లడించింది.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్‌పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి