ములుగు రూరల్, సెప్టెంబర్25: ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్‌లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్‌లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్నిస్తున్నారు. తాను మీటింగ్‌లో ఉన్నానని, అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ +998886747021 ఉజ్బెకిస్తాన్ నంబర్ నుంచి సందేశాలను పంపి డబ్బులు ఫోన్‌పే చేసి స్క్రీన్‌షాట్ షేర్ చేయాలని పలు వురికి మెసేజ్‌లు పంపించారు.
అధికారుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ బుధవా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమ త్తం చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని సూచించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.