రాయపర్తి : వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర్తికి వస్తున్న దయాకర్‌రావును మండలంలోని పెర్కవేడులోని ప్రధాన కూడలిలో పలువురు రైతులు, బీఆర్ఎస్ నేతలతో కలసి ఎర్రబెల్లికి తమ గోడు వెల్లబోసుకున్నారు.
మండలంలోని రాగన్నగూడెం, పెర్కవేడు, గణేశ్‌కుంట తం డా, సూర్యతండా, అవుసులకుంట తండా, కొత్తూరు, బంధన్‌పల్లి, కొండాపురం, గట్టికల్, ఊకల్ తదితర గ్రామాల్లో రైతులు వరి పొలాలన్నీ పొట్ట దశ నుంచి పూర్తిగా ఈని ధాన్యపు గింజలు పాలు పట్టే దశలో ఉన్నట్లు వివరించారు. ఈ క్రమంలో అధికారులు ఎస్సారెస్పీ నీళ్ల విడుదలను నిలిపివేయడం తో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయినట్లు చెప్పారు. చేతికందే దశలో ఉన్న వరి, మక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు నీళ్లు వచ్చేలా చూడాలని ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడు తూ రైతుల గోడును వివరించి సాగు కోసం జలాలు విడుదల చేయాలని కోరారు.