హనుమకొండ, జనవరి 25 : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చిందని, అందుకు గ్రామసభలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాయలంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే లు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పథకాల అమలు పేరుతో నిర్వహించిన గ్రామసభలు దౌర్జన్య సభలుగా మా రాయని విమర్శించారు. మూడు విడతల్లో లబ్ధిదారుల నుంచి తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్న ఆశతో ప్రజలు గ్రామసభలకు వస్తే మళ్లీ దరఖాస్తులు స్వీకరించారే తప్ప లబ్ధిదారులను ఎంపి క చేయలేదని, ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పొలం దున్నే ముందు, నారుపోసే సమయంలో రైతుబంధు వేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏడా ది కాలంగా రైతుభరోసా ఇవ్వలేదన్నారు.
ఇదే విషయాన్ని గ్రామసభల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తే దాటవేశారన్నారు. గ్రామ సభలు అట్టర్ ఫ్లాప్ అని, అన్నింటా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు ఇతర రాష్ట్రాలకు పోయి సిగ్గులేకుండా చెబుతున్నారని దుయ్యబట్టారు. దావోస్ పెట్టుబడులు శుద్ధ అబద్ధమని, సీఎం స్థాయిలో ఉండి రేవంత్‌రెడ్డి నీతి లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
గత ఏడాది దావోస్‌లో ఒప్పందం చేసుకొని తెచ్చామన్న రూ.40వేల కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులను కాంగ్రె స్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో వరంగల్ నుంచి ఐటీ కంపెనీ లు వెళ్లిపోతున్నాయని, టెక్స్టైల్ పార్కు విషయంలో స ర్కారు సహకరించడం లేదని అధికారులే చెబుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మా జీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్, నాయకులు పోలపల్లి రామ్మూర్తి, రవీందర్రావు, రమేశ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న గ్రామసభలు అట్టర్ ఫ్లాప్ అ య్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రు లు, అధికారులకు నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. పోలీసుల పహారాలో సభలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నది. నర్సంపేట లో పోలీసు స్టేషన్ ఎదుట మాజీ కౌన్సిలర్‌ను కొడితే గంటల తరబడి ఎదురుచూసినా న్యాయం చేయలేదు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. వరంగల్ సీపీ అంటే గౌరవం ఉంది. ఎమ్మెల్యేలకు కల్పించిన భద్రతపై దృష్టి సారించాలి. తుపాకులతో తిరుగుతూ కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ లు అమలు చేయకుండా గ్రామ, వార్డు సభలు, దరఖాస్తులు, సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఒక మహిళా అధికారి అని చూడకుండా అహంకారంతో మంత్రి దూషించడాన్ని ఖం డిస్తున్నా. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే కట్టేసి కొడతామని బెదిరింపులకు దిగుతున్నారు. రైతు బంధు, బీమా అడిగే రైతులను కొడతారా? ఇందిరమ్మ ఇళ్లు, ఇస్తానన్న రూ. 2500లు, పింఛన్ అడిగితే కొడతారా? రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరు ఎవరిని కొడతారో
– దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణలో రోజురోజుకు రై తు ఆత్మహత్యలు పెరుగుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక 409 రైతులు ప్రాణాలు తీసుకున్నరు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన హత్యలే. రైతు భరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు రూ. 17,500లు బాకీ ఉంది. అలాగే రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని జాబ్‌కార్డులు, పనిదినాల పే రుతో కోతలు పెడుతున్నది. కౌలు రైతు సంగతి పూర్తిగా మర్చిపోయింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామసభలకు హాజరుకాకుండా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. రుణమాఫీ 40 శాతానికి మించలేదు.
-తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వరంగల్ అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చింది. జిల్లా మంత్రి కొండా సురేఖ గ్రామసభలకు హాజరు కాదు. ప్రజా సమస్యలను పట్టించుకోదు. గుమస్తాలను పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్నారు. గ్రామ సభల్లో దరఖాస్తులను రూ. 500కు అమ్ముతున్నరు. ప్రజలు నిలదీస్తే పోలీసులతో కొట్టిస్తున్నరు. వరంగల్‌లో రెండు మూడు షాపింగ్ మాల్స్‌ని కూలగొట్టి సెటిల్మెంట్ అనంతరం పరదాలు అడ్డుకట్టి నడిపిస్తున్నరు.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే