తొర్రూరు, ఫిబ్రవరి 8 : దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తొర్రూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మొన్న మహారాష్ట్రలో, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోలేదని, ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు లేకుండానే పథకాలను అమలు చేశామని, కానీ, ఇప్పుడు ప్రతి పథకానికి మీ సేవ దరఖాస్తుల పేరిట ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని అన్నారు.
రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తప్పని, పేదలకు న్యాయం చేసే సంకల్పం లేకుండా, ప్రభుత్వ నిధులకు కోతలు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రజాపాలన, గ్రామసభల పేరిట హడావుడి చేసి చివరికి మళ్లీ మీ సేవ దరఖాస్తుల పేరుతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి బ్రోకర్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదించడంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని విమర్శించారు. సీఎం అయిన తర్వాత కూడా అదే తంతు కొనసాగిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిందని, ఇప్పటివరకు ఒక హామీనీ పూర్తిగా అమలు చేయలేదని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరసరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇది వారికి బుద్ధి చెప్పే సమయమని పేరొన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు పొనుగంటి సోమేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య పాల్గొన్నారు.