రేవంత్‌రెడ్డి పాలనలో రైతుల అరిగోస
రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలిపారు.
- వానకాలం వచ్చిన వడ్లు కాంటా కావా ?
- రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయకుంటే ఆందోళన చేపడుతాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి
- తొర్రూరు(జే) తడిసిన ధాన్యం పరిశీలన
- నర్సింగపురంలో రైతులకు భరోసా
పాలకుర్తి/కొడకండ్ల, జూన్ 12 : రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలిపారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మండిపడ్డారు.
వాన కాలం వచ్చి వర్షాలు పడుతున్నా వడ్లు కాంటాలు కావా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక, మరోవైపు కాంటా అయిన ధాన్యా న్ని మిల్లుల వద్ద దింపుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. తరుగు పేరుతో కొనుగోలు కేం ద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను ముంచుతున్నారన్నారు. రైతుల బాధలను చూసైనా సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. నేటికీ రైతుభరోసా సాయం అందలేదని, సన్నవడ్లకు బోనస్ రాలేదన్నా రు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దయతో పంటలు బాగా పండుతున్నాయని, రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలల్లో వడ్లు పూర్తిగా కాంటా వేసి తరలించకుంటే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించారు.,
రైతుల సమస్యలు తెలుసుకున్న ఎర్రబెల్లి
కొడకండ్ల మండలం నర్సింగపురంలోని తిరుమల సాయి రైస్ మిల్లు ఎదుట ఏడునూతుల గ్రామ రైతులు వడ్ల లోడు వాహనాలతో రోజుల తరబడి నిరీక్షిస్తుండగా అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి వాహనాన్ని రైతులు ఆపారు. ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యాన్ని వా రు వివరించి కన్నీరు పెట్టుకున్నారు. రైతుల సమస్యలను విన్న దయాకర్‌రావు నర్సింగపురంలోని తిరుమల సాయి రైస్ మి ల్లును పరిశీలించారు.
ధాన్యాన్ని కాంటా వేయడంలో, లారీల నుంచి గోదాములకు తరలించడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 100కు పైగా వడ్లలోడు వాహనాలతో రైతులు రోజుల తరబడి రోడ్డుపైనే వేచిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్ర వీడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పారుపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకుడు పల్లా సుందర్‌రాంరెడ్డి, మండల నాయకులు నల్లా నాగిరెడ్డి, చిదిరాల ధనుంజయ, లొంక మల్లేశ్, గోనె ఎల్లారెడ్డి, రైతులు ఉన్నారు .
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

