తొర్రూరు/పెద్దవంగర/ఐనవోలు, డిసెంబర్ 1: అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్, మూల రాజు సహా సుమారు 40 మంది, అలాగే గుడిబండ తండా గ్రామానికి చెందిన 20 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పెద్దవంగరం మండల కేంద్రంలోబొమ్మకల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుర్ర జంప య్య, చిన్నవంగరకు చెందిన నాయకులు రాంపాక యాకయ్య, యాసారపు కవిత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఐనవోలు మండలంలోని కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కంటెస్ట్ అభ్యర్థి బర్ల వాణి-రవికుమార్‌తో పాటు సుమారు 20 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎర్రబెల్లి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలన్నారు. అందరూ సమన్వయంతో అభ్యర్థుల గెలు పు కోసం పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగడుతూ.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజ ల్లోకి వెళ్లాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో చేపట్టిన సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే చూపుతున్నాయని పేరొన్నారు. కాగా, బీఆర్ఎస్ నాంచారిమడూరు గ్రామ శాఖ ఏకగ్రీవంగా ఎంపిక చేసిన స ర్పంచ్ అభ్యర్థి మంద మల్లేశ్ నామినేషన్ కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమా ల్లో బీఆర్ఎస్ తొర్రూరు మండల ఆధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందర్రావు, కన్వీనర్ తంపుల మోహన్, ఇన్చార్జి గుజ్జ గోపాల్‌రావు, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, గ్రామ ఇన్చార్జి అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుంభం సుకన్య, మాజీ సర్పంచ్ గుతుక యాదలక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ లు వెంకటేశ్వర్లు, ప్రకాశ్, నాయకులు గుంటుక కుమార్, సుధాకర్, సంపత్, శ్రీను, సోమనర్సింహారెడ్డి, సునీల్ రెడ్డి, సంజయ్, సుధీర్‌కుమార్, వెంకట్రామయ్య, గంగాధర్‌యాదవ్, రవి, వేణుసాగర్, భిక్షపతి, రామ్మూర్తి, అల్లం సోమయ్య, ఏలియా తదితరులు పాల్గొన్నారు.