రాయపర్తి : ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంటగలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో వ్యాఖ్యలు చేస్తున్నారనిమాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి మండల పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ అధ్యక్షతన జరిగిన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘ కాలం పాటు అలు పెరగని పోరాటాలు చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో గత పదేళ్లు ఇష్టపడి బాగు చేసుకున్నామని చెప్పారు.
పరిపాలనపరంగా ఎటువంటి అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తూ రాష్ట్ర పరువును తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిపాలన చేతకాని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో అనేక అవార్డులను కైవసం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా గులాబీ జెండాను గుండెలకు హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.
మండలంలోని అన్ని గ్రామాలలో గులాబీ సైనికులంతా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్తులు, మండల పరిషత్లు, గ్రామపంచాయతీలన్నింటిపై గులాబీ జెండాలను ఎగరవేసేందుకు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుడిపూడి గోపాలరావు, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, కర్ర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.