పెద్దవంగర, మే 1: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ ఒకరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పిండి యాకయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి గురువారం పార్టీ ఇన్సూరెన్స్ బీమా రూ.2లక్షల చెకును స్థానిక నాయకులతో కలిసి అందజేసి మాట్లాడారు.
కార్యకర్తలు ఇబ్బందిపడకూడదనే ముందుచూపుతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా బీమాను కల్పించినట్లు తెలిపారు.