తొర్రూరు/పర్వతగిరి, డిసెంబర్ 7: కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు తండా, ఎస్వీకే తండా, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం దయాకర్ రావు మాట్లాడుతూ సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సముదాయాలను మోసం చేసిందని, రైతులకు యూరియా కొరత రావడం పాలనా వైఫల్యమేనన్నారు.
కేసీఆర్ హయాంలో రైతులు రాజుల్లా బతికారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పెరిగాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ గారడీ మాటలేనని, ఎన్నికల సమయం లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమ లు చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమర్‌సింగ్ తండాలో కాంగ్రెస్ 8వ వార్డు అభ్యర్థి ధరావత్ మౌనికాఉపేందర్, బేడ బుడగజంగాల సం ఘానికి చెందిన నాయకులు తూర్పాటి బైరాగి, పస్తం సమ్మయ్య, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన అంజయ్య, బీఆర్ఎస్ ఇన్చార్జి కుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ ఎంపీపీ తూర్పా టి అంజయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నల్లమాస ప్ర మోద్ కుమార్, పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఎన్నమనేని శ్రీనివాస్, అమర్‌సింగ్ తండా ఇన్చార్జి ధరావత్ బాలునాయక్, కుమారస్వామి, రాములు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.